ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై షర్మిల ఫైర్
YS Sharmila: బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణగా మార్చారు
YS Sharmila: సీఎం కేసీఆర్‌పై ట్విట్టర్ వేదికగా YSRTP అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధిలో పోటీ పడాల్సిన సారు ఆయన కారు అప్పులు, అత్యాచారాలు, ఆత్మహత్యలతో పోటీ పడుతోందని ఆరోపించారు. మిగులు బడ్జెట్ నుంచి 4లక్షల కోట్ల అప్పులు చేశారని కనీసం 4లక్షల మందికైనా ప్రయోజనం కలిగిందా? అని ప్రశ్నించారు. రెండేండ్లలోనే చేసిన లక్ష కోట్ల అప్పు ఎక్కడ పోయిందన్నారు షర్మిల. బంగారు తెలంగాణ పేరుతో అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు.
అభివృద్ధిలో పోటీ పడాల్సిన 'సారు ఆయన కారు' అప్పులు, అత్యాచారాలు,రైతుల ఆత్మహత్యలు,మానవ అక్రమ రవాణాలో పోటీ పడుతోంది. 16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 8 ఏండ్లలో 4లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరిని ఉద్ధరించారు దొర గారు? రెండేండ్లలోనే మీరు చేసిన లక్ష కోట్ల అప్పు ఎక్కడ పోయింది?
— YS Sharmila (@realyssharmila) December 22, 2022
1/3