ఎన్టీఆర్ కు ప్రముఖుల నివాళి

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 24వ వర్ధంతి నేడు. ఆయన వర్ధంతి పురస్కరించుకొని ఎన్టీఆర్‌ ఘాట్‌లో ఏర్పాట్లు చేశారు.

Update: 2020-01-18 04:51 GMT

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 24వ వర్ధంతి నేడు. ఆయన వర్ధంతి పురస్కరించుకొని ఎన్టీఆర్‌ ఘాట్‌లో ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్‌ ఘాట్‌లోని సమాధికి మరమ్మతులతో పాటు పుష్పాలంకరణ చేశారు. మరోవైపు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళి అర్పించారు. ముందుగా మనవళ్ళు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌, తారకరత్న నివాళులు అర్పించి.. పుష్పాంజలి ఘటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి నివాళి అర్పించారు. ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి కూడా కుటుంబ సమేతంగా ఎన్టీఆర్‌ ఘాట్‌కు వచ్చి తన తండ్రికి పుష్పాంజలి ఘటించారు. బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.

ఎన్టీఆర్ 24వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద మోత్కుపల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల కోసం ఆయన తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారని అన్నారు. ఆయనతో కలిసి పనిచేయడం మరువలేనిది అన్నారు. నందమూరి బాలకృష్ణ, నందమూరి సుహాసిని, రావుల చంద్రశేఖర్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ తదితరులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. ఇక సనత్‌నగర్‌ నియోజకవర్గం ఇంచార్జి శ్రీపతి సతీష్‌ ఆధ్వర్యంలో రసూల్‌పూర చౌరస్తా ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌ వరకు అమరజ్యోతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎల్‌.రమణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరవుతారని ఆయన తెలిపారు.  


Full View


Tags:    

Similar News