సంతలో పశువులని కాదు... అమ్మాయిలను అమ్ముతున్నారు
ఎవరైనా సంతలో కూరగాయలు, పశువులు అమ్మడం చూసాం. కాని ఆ ఊర్లో మాత్రం పశువులను అమ్మినట్టుగా అమ్మాయిలను అమ్ముతున్నారు.
ఎవరైనా సంతలో కూరగాయలు, పశువులు అమ్మడం చూసాం. కాని ఆ ఊర్లో మాత్రం పశువులను అమ్మినట్టుగా అమ్మాయిలను అమ్ముతున్నారు. అవును ఆ ఊర్లో 18 ఏళ్ళు దాటిన అమ్మాయి వుంటే చాలు ఆ అమ్మాయిని సంతలో పశువులను బేరానికి పెట్టినట్టు పెట్టి అమ్మేస్తారు. మానవ విలువలను మంట గలుపుతూ డబ్బుల కోసం కొన్ని గిరిజన తండాల్లో ఈ దందా కొనసాగిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జల్లా నారాయణ ఖేడ్‌లో నాలుగేళ్లుగా ఈ అమానుష సంఘటనలు జరుగుతున్నాయి. వ్యాపారం పేరుతో రాజస్థాన్ నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు నారాయణ ఖేడ్‌లో నివాసముంటున్నారు. పెళ్ళీడుకొచ్చిన అమాయక గిరిజన యువతులతో పరిచయం పెంచుకుని పెళ్లి పేరుతో మోసం చేస్తూ అమ్మాయిలను అమ్మకానికి పెడుతున్నారు.
ఈ దందా కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా ఇంకా చాలా చోట్ల జరుగుతుందని స్థానికులు తెలుపుతున్నారు. డబ్బు మీద ఆశతో ఆ పేద గిరిజన కుటుంబాలు కూడా అమ్మాయిల్ని అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారు. ఒక్కో అమ్మాయి విలువ దాదాపు రూ.15 లక్షలు అని స్థానికులు చెప్తునారు.