Congress: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్.. పూర్తి వివరాలివే..
Congress: గృహ నిర్మాణం కోసం రూ.6 లక్షల సాయం
Congress: తెలంగాణ కాంగ్రెస్12 డిక్లరేషన్లను ప్రకటించింది. దళిత, గిరిజన డిక్లరేషన్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థికసాయం అందిస్తామన్నారు. దళిత, గిరిజనులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. గృహ నిర్మాణం కోసం రూ.6 లక్షల సాయం అందిస్తామని చెప్పారు. పోడు భూములపై సర్వ హక్కులు కల్పిస్తామని తెలిపారు. పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తామని... ఎస్సీ వర్గీకరణ చేసి న్యాయం చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఎస్సీలకు 18, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. ప్రైవేట్ కంపెనీల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెడతామని..
విదేశీ వర్సిటీల్లో ప్రవేశం పొందిన వారికి ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. రూ.12 లక్షలతో దళిత బంధు, దళిత గిరిజన విద్యార్థులకు టెన్త్ పాసయితే రూ.10 వేలు, ఇంటర్‌కి రూ.15 వేలు, డిగ్రీకి రూ.25 వేల సాయం అందిస్తామన్నారు. పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ.లక్ష సాయం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.