Telangana: తెలంగాణ ప్రభుత్వానికి భారీగా చేరుతున్న ఆదాయం
Telangana: 2022-23 ఆర్దిక సంవత్సరంలో ఒక్క నెలలోనే రూ. 711 కోట్లు వసూలు
Telangana: తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు రావడంతో రెవెన్యూ శాఖకు క్రమంగా భారీగా ఆదాయం చేకూరుతుంది. గత ఏడాదితో పోల్చితో ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి రికార్డు స్థాయిలో ఆధాయం సమకూరినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆధికారులు చెబుతున్నారు. ప్రతి నెల వెయ్యి కోట్ల మేర ఆదాయం వస్తుంది. 2021-22 సంవత్సరానికి 12 వేల 364 కోట్లకు పైగా ఆదాయం సమకూర్చుకొని రికార్డు నెలకొల్పగా తాజాగా 2022-23 ఆర్ధిక సంవత్సరం మొదటి నెలలో ఏప్రిల్ 18వ తేదీ నాటికే 711 కోట్లు ఆదాయం వసూలయ్యింది. మరో పది రోజుల్లో 300 కోట్ల మేర ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా ఒక్క నెలలోనే 1500 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.