Revanth Reddy: తెలంగాణ ప్రజలకు ఇవాళే స్వేచ్ఛ లభించింది

Revanth Reddy: విద్యార్థి,నిరుద్యోగ,అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తాను

Update: 2023-12-07 11:27 GMT

Revanth Reddy: తెలంగాణ ప్రజలకు ఇవాళే స్వేచ్ఛ లభించింది

Revanth Reddy: తెలంగాణ ప్రజలకు ఇవాళే స్వేచ్ఛ లభించిందని.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజలను ఉద్దేశించి తొలిసారి సీఎం రేవంత్ మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటుతో ఇక అంతటా సమానాభివృద్ధి సాధ్యమని తెలిపారు. తెలంగాణ ఆషామాషీగా ఏర్పడిన రాష్ట్రం కాదని... పోరాటాలతో త్యాగాలే పునాదులుగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.

పదేళ్లుగా నిరంకుశత్వాన్ని రాష్ట్ర ప్రజలు మౌనంగా భరించారని... ఇప్పటికే ప్రగతిభవన్‌ ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించాని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చుదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రజల బిడ్డగా.. ప్రజల సోదరుడిగా.. తెలంగాణ ప్రజల బాధ్యతలను తాను నిర్వహిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. తాము పాలకులం కాదని.. తెలంగాణ ప్రజల సేవకులమన్న సీఎం రేవంత్ రెడ్డి... కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తుపెట్టుకుంటానని తెలిపారు. పదేళ్లుగా కష్టపడిన కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటానన్నారు. విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు.

Tags:    

Similar News