Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు కళంకంగా మారింది

Revanth Reddy: గతంలో సబిత కూడా ధర్నా చేశారు.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు?

Update: 2024-02-17 09:10 GMT

Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు కళంకంగా మారింది

Revanth Reddy: సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం కొనసాగింది. ఈ క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్‌. బీఆర్ఎస్ పాపం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజ్‌లు కుంగిపోతున్నాయన్నారు. ఇంజినీర్లు ఇచ్చిన నివేదికను ఆనాటి సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్ రావు తొక్కిపట్టి మరీ మేడిగడ్డ ప్రాజెక్టును కట్టారని ఆరోపించారు. 38వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్లను వదిలేసి లక్షా 47వేల కోట్లతో కాళేశ్వరం కట్టి అప్పుల భారం మోపారని అన్నారు సీఎం రేవంత్‌.

కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయినిగా కాదు.. కళంకంగా మారిందన్నారు సీఎం రేవంత్. ఈ పాపాలకు కేసీఆర్, హరీష్‌ రావు బాధ్యులు అన్న రేవంత్ రెడ్డి.. ఇద్దరూ కలిసి తెలంగాణను చెదలు పట్టించారని ఆరోపించారు. పదేళ్లు అదికారమిస్తే తెలంగాణను నిండా ముంచారన్నారు.

ఇక ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును ఆపితే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు సీఎం రేవంత్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కేసీఆర్‌ అన్యాయం చేశారని ఆనాడు ధర్నా చేసిన సబిత.. అసెంబ్లీ వేదికగా హరీష్ రావు తప్పులు మాట్లాడుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం మానుకొని... ఒప్పుకోవాలని సూచించారు సీఎం రేవంత్‌.

Tags:    

Similar News