కేసీఆర్ లెటర్‌పై స్పందించిన పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి

కేసీఆర్ తెలిపిన అభ్యంతరాలపై పున‌:పరిశీలన చేస్తాం

Update: 2024-06-16 08:51 GMT

కేసీఆర్ లెటర్‌పై స్పందించిన పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి

విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కేసీఆర్ రాసిన లేఖపై పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి స్పందించారు. కేసీఆర్ రాసిన లేఖ తమకు అందిందని.. లేఖలో కేసీఆర్ ప్రస్తావించిన అంశాలను పరిశీలన చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ తెలిపిన అభ్యంతరాలపై పున‌:పరిశీలన చేస్తామన్నారు. విద్యుత్ ఒప్పందాలపై కేసీఆర్ ఇచ్చిన వివరాలు, వాస్తవాలను సరిపోల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు జస్టిస్ ఎల్‌.నరసింహారెడ్డి. వాస్తవాలపై BHEL ప్రతినిధులని కూడా వివరాలు అడుగుతామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లపై కేసీఆర్‌ సమాధానం ఇచ్చారని.. లేఖపై నిపుణుల కమిటీతో చర్చించిన అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

Tags:    

Similar News