MLC L Ramana: చేనేత కళాకారులపట్ల కేంద్రం క్రూరంగా వ్యవహరిస్తోంది
MLC L Ramana: చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలి
MLC L Ramana: చేనేత కళాకారుల పట్ల కేంద్రం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ మండిపడ్డారు. చేనేత ఉత్పత్తులపై కేంద్రం విధిస్తున్న 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేనేత కళాకారులు రాసిన లక్షలాది ఉత్తరాలతో హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్ నుంచి అబిడ్స్‌లోని జనరల్ పోస్టాఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేసి నేత కార్మికుల జీవిత బీమా, సబ్సిడి, హ్యాండ్లూమ్, పవర్ లూమ్ బోర్డు వంటి సంక్షేమ కార్యక్రమాలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేసేంతవరకు పోరును కొనసాగిస్తామని ఎల్ రమణ స్పష్టం చేశారు.