TS News: తెలంగాణలో రసవత్తరంగా రాజకీయాలు

TS News: పవర్ పాలిటిక్స్ లో హస్తం పార్టీ హవా

Update: 2024-03-29 07:26 GMT

TS News: తెలంగాణలో రసవత్తరంగా రాజకీయాలు

TS News: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ నడుపుతున్న పవర్ పాలిటిక్స్ కు బీఆర్ఎస్ పార్టీ కుదేలవుతోంది. బీఆర్ఎస్ పార్టీ కీలకనేతలంతా ఒక్కొక్కరుగా కారులోంచి దూకి చేయందుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల ముంగిట.. కాంగ్రెస్ లోకి భారీగా నేతలు క్యూ కడుతున్నారు. కీలక నేతలు హస్తం గూటికి చేరుతుండడంతో కార్ పార్టీ నేతలు బేజారవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు ఆయన కుమార్తె, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్ కార్యాచరణపై కేకే, సీఎం రేవంత్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. కీలక నేతైన కేకే పార్టీని వీడటం పట్ల కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. 

మరోవైపు బీఆర్ఎస్ వరంగల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కడియం కావ్య సైతం కారుకు బ్రేకులు వేశారు. చేయందుని హస్తం గూటికి చేరడానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వైదొలిగారు. బీఆర్ఎస్ పార్టీ పై వస్తున్న అవినీతి ఆరోపణలతో పార్టీ ప్రతిష్ట దిగజారిందని, ఓరుగల్లు నేతల మధ్య కూడా సమన్వయం లేదని కేసీఆర్ కు రాసిన లేఖలో వివరించారు. స్టేషన్ ఘనాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్ లో చేరేందుకు  సిద్ధమయ్యారు. దీంతో వరంగల్ లో బీఆర్ ఎస్ అభ్యర్థి కోసం పార్టీనేతలు కసరత్తులు ప్రారంభించారు. ఒకేసారి ఇద్దరు ప్రముఖనేతలు, వారి కుమార్తెలు బీఆర్ఎస్ పార్టీని వీడడంతో హస్తం పార్టీ నేతలు జోష్ మీద ఉన్నారు.

Tags:    

Similar News