నేటి నుంచి పీజీ మెడికల్, డెంటల్ పరీక్షలు

నేటి నుంచి తెలంగాణాలో పీజీ మెడికల్, డెంటల్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

Update: 2020-06-20 02:11 GMT

నేటి నుంచి తెలంగాణాలో పీజీ మెడికల్, డెంటల్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వీటిని వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించడంతో పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని నిర్వహిస్తున్నారు. వీటిపై కొన్ని సెంటర్లు మార్చిన కారణంగా విద్యార్థులు ముందుగా సరిచూసుకుని కేంద్రానికి వెళ్లాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణలో పీజీ మెడికల్, డెంటల్ పరీక్షలను వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించడంతో ఈ నెల 20 నుంచి పరీక్షలు యధాతధంగా జరగనున్నట్లు కాళోజీ వర్సిటీ ప్రకటించింది. హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు పరీక్షలకు హాజరుకాలేని స్టూడెంట్స్ సప్లిమెంటరీ రాసినా రెగ్యులర్ విద్యార్దులుగానే ప్రకటిస్తామని పేర్కొంది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ యూజీసీ, యంసిఐ, ప్రభుత్వ నిబంధనల మేరకు పరీక్షల నిర్వహిస్తామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పేర్కొన్నారు.

పరీక్షలకు సంబంధించి మరిన్ని పాయింట్స్…

- ఈ నెల 20, 22, 24 తేదీలలో పీజీ డిప్లొమా పరీక్షలు.

- జూన్ 20, 22, 24, 26 తేదీల్లో పీజీ డిగ్రీ పరీక్షలు జరగనున్నాయి.

- ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

- ఉదయం 8.30కి స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలి.

- మొత్తం 13 సెంటర్లు ఉండగా.. గాంధీ మెడికల్ కాలేజీ సెంటర్‌ను కామినేని అకాడమీ - ఆఫ్ మెడికల్ సైన్సెస్ , ఎల్బీ నగర్, సికింద్రాబాద్‌కు తరలించారు.

- 994 మంది పీజీ డిగ్రీ పరీక్షలు, 193 మంది పీజీ డిప్లొమా పరీక్షలు రాయనున్నారు.

- కోవిడ్ 19 నేపథ్యంలో అన్ని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన జాగ్రత్తలు చేపట్టారు.

- పెద్ద లెక్చర్ హాల్స్, ఎగ్జాం హాల్స్‌లో 25 నుండి 30 మంది విద్యార్థులకు మాత్రమే సీటింగ్ ఏర్పాట్లు చేశారు.

- అన్ని పరీక్షా కేంద్రాలలో భౌతిక దూరం పాటిస్తూ విద్యార్థులకు సీట్ల కేటాయించారు.


Tags:    

Similar News