IT Rides: కొనసాగుతున్న ఐటీ రైడ్స్.. శేఖర్‌రెడ్డి ఇంట్లో 12 గంటలుగా సోదాలు
Shekar Reddy భారీగా నగదు, కీలక డాక్యుమెంట్లు సీజ్
IT Rides: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. కొత్తపేట్‌లోని శేఖర్‌రెడ్డి ఇంట్లో 12 గంటలుగా సోదాలు నిర్వహిస్తున్న అధికారులు.. ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి నివాసంతో పాటు.. ఆయన మామ మోహన్‌రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు చేపట్టారు. భారీగా నగదు, కీలక డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, పైలా శేఖర్‌రెడ్డి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే.. ఒకే కంపెనీలో ముగ్గురు డైరెక్టర్ల మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. పన్నుల చెల్లింపులో అవకతవకలు జరిగినట్టు వివరాలు సేకరించారు.
ఇదిలా ఉంటే.. హిల్ ల్యాండ్ టెక్నాలజీ, మెయిన్ ల్యాండ్స్ డిజిటల్ టెక్నాలజీస్ కంపెనీలకు పైలా వనితారెడ్డి డైరెక్టర్‌గా ఉండగా.. ఇదే కంపెనీకి మరో డైరెక్టర్‌గా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి భార్య మంజులత వ్యవహరిస్తున్నారు. అయితే.. ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల తనిఖీలపై బీఆర్‌ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. శేఖర్‌రెడ్డి ఇంటి వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఐటీ రైడ్స్‌ను వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తున్నారు.