తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ
Covid Vaccination: కొవాగ్జిన్, కోవిషీల్డ్ రెండు వ్యాక్సిన్స్ అన్ని సెంటర్లలో అందుబాటులో ఉంచారు.
Covid Vaccination: కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయినప్పటికీ కొన్ని చోట్ల సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ప్రైవేట్ హాస్పటల్స్‌లో ఫస్ట్ డోస్ తీసుకున్న డీటేల్స్ కొందరి దగ్గర లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు వైద్యులు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కోవాక్సిన్, కోవిశిల్డ్ వ్యాక్సిన్లపై అపోహలు కొంత మేర పోవడంతో జనం వ్యాక్సిన్ సెంటర్స్‌కు క్యూ కట్టారు. దీంతో సెంటర్లలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. వ్యాక్సిన్ కోసం వస్తున్న వారు చాలా మంది మొదటి డోస్ ప్రైవేట్ హాస్పిటల్స్‌లో తీసుకొని రెండవ డోస్ కోసం కింగ్ కోఠికి వెళ్లిన వారి వద్ద ఫ్రూవ్ లేకపోవడంతో ఇవ్వలేకపోతున్నామంటున్నారు డాక్టర్ జయశ్రీ. ఎలాంటి ప్రూఫ్ లేకుండా సెకండ్ డోస్ ఇవ్వలేమని కచ్చితంగా ప్రూఫ్ తీసుకొని రావాలని సూచిస్తున్నారు.
వ్యాక్సిన్స్ తీసుకునేందుకు మొదట్లో చాలా మంది భయపడే వారని డాక్టర్ సాధన అంటున్నారు. కాని ఇప్పుడు వ్యాక్సిన్స్‌పై అవగాహణ రావడంతో కొంతవరకు మార్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఫ్రెంట్ లైన్ వారియర్స్‌లో కూడా తీసుకోని కొందరు ఇప్పుడు అపోహలు పోగొట్టుకుని ముందుకు వస్తున్నారని చెబుతున్నారు. తప్పనిసరిగా ప్రతీఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచిస్తున్నారు.