Lockdown: తెలంగాణలో కొనసాగుతున్న 11వ రోజు లాక్‌డౌన్
Lockdown: స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోన్న పోలీసులు * కాలనీల్లో సైరన్ తో అలెర్ట్
Lockdown: తెలంగాణలో 11వ రోజు లాక్‌డౌన్ కొనసాగుతోంది. నిత్యావసరాల కోసం ఉదయం 6 గంటల నుంచి 10గంటల వరకు మినహాయింపు ఇచ్చారు. ఆ తర్వాత ఎవరు రోడ్లమీద కనిపించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అనవసరంగా రోడ్లమీదకు వస్తే బండి సీజ్, కేసు నమోదు చేయాలని అధికారులకు తెలిపారు. మరోవైపు.. కాలనీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. సైరన్‌తో అలెర్ట్ చేయాలన్నారు. ఎమర్జెన్సీ సర్వీసులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు ఇంకొవైపు పాస్‌లను మిస్ యూజ్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు.
తెలంగాణలో లాక్‌డౌన్‌ను ప్రజలు నిన్నటివరకూ లైట్ తీసుకున్నారు. దీంతో గేర్ మార్చిన పోలీసులు యాక్షన్‌లోకి దిగిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. అనవసంగా రోడ్డెక్కారని తేలితే బండి సీజ్ చేయడంతోపాటు ఆయా వ్యక్తులపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఈ విషయంలో రాచకొండ పోలీసులు అందరికంటే ముందున్నారు. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 21 వేలకు పైగా కేసులు నమోదు చేశారు. ఇందులో మాస్కులు లేకుండా తిరిగినందుకు నమోదు చేసిన కేసులు 6వేలు ఉన్నట్లు తెలుస్తోంది. డీజీపీ ఆదేశాల మేరకు జీహెచ్ఏంసీ పరిధిలో 330 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
హైదరాబాద్ పరిధిలో కరోనా లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. హైద్రాబాద్ కమిషనరేట్ పరిధిలో 180 పైగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.. 24 గంటలు పోలీసుల తనిఖీలు చెక్ పోస్టులులో సాగుతున్నాయని హైద్రాబాద్ సిటి పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 60 వాహనాలను సీజ్ చేశామని వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన ఎమర్జెన్సీ పాస్ లను మిస్ యూజ్ చేయడంతో పాటు అకారణంగా పాత డాక్టర్ ప్రెస్క్రిప్షన్ పెట్టుకొని వంకర సమాధానాలు చెప్పేవారిపై చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.