Telangana: తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు

Telangana: ముందుగా డబ్బులు చెల్లించినా..అయిల్ సరఫరాలో ఆలస్యం

Update: 2022-06-22 05:45 GMT

Telangana: తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు

Telangana: ఇన్ని రోజులు పెట్రల్ ధర పెరిగి సతమతమైన వాహనదారులకు కొత్త సమస్య వచ్చింది. పెట్రల్ ధర తగ్గిందని సంబరపడేలోపు పెట్రోల్, డిజిల్ కొరత ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. వాహనాలు తీసుకుని బంకుల వద్దకు వెళ్తే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెట్రోల్ బంక్‌లలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇన్నాళ్లు పెట్రోల్ బంక్‌లకు క్రెడిట్ ఇచ్చిన అయిల్ కంపెనీలు.. ముందుగా డబ్బు చెల్లిస్తేనే చమురు ఉత్పత్తి చేస్తామంటూ చెబుతున్నాయి. వంద శాతం ముందుగా డబ్బులు చెల్లించినా కూడా అయిల్ సరఫరాలో ఆలస్యం అవుతోంది. కొన్నిచోట్ల నో స్టాక్ అంటూ బోర్డులు పెడుతుంటే మరికొన్ని చోట్ల అయిల్ ట్యాంకర్లు వచ్చే వరకూ ఆలస్యం అవుతుండటంతో, ఉన్న పెట్రోల్‌ను విక్రయిస్తున్నారు. నగరంలో పరిస్థితి ఒక్కలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరోలా ఉంది. అక్కడ లిమిటెడ్ స్టాక్ నే అధిక ధరలకు అమ్మేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బంక్ నిర్వహకులకు ఇంతకుమందులాగా అయిల్ కంపెనీలు క్రెడిట్ సౌకర్యం నిలిపివేశాయి. దీంతో పలు కంపెనీల పెట్రోల్ బంకులలో పెట్రోల్, డీజిల్ నిల్వలు అడుగంటి పోతున్నాయి. ఎప్పుడు లేని విధంగా చమురు కంపెనీలు బంకులకు అప్పు కింద, అయిల్ అందించడానికి స్వస్తి చెప్పడంతో రాష్ట్రంలో పలు కంపెనీల బంకుల వద్ద ఈ పరిస్థితి ఏర్పడింది. అయిల్ కంపెనీల నిబంధనల ప్రకారం, సంబంధిత కంపెనీ బంకుకు వారం రోజుల సరిపడా ఓ.డి.డి కింద పెట్రోల్ డీజిల్‌ను అందజేస్తాయి. ప్రతిరోజు ఆ బంకు అమ్మకాన్ని బట్టి ఆయా కంపెనీలు ఫ్యూయల్ సరఫరా చేయాల్సి ఉంటుంది.

హైదరాబాద్ నగరంలో బంకులు గత వారం రోజులుగా హెచ్.పి, భారత్ బంకులు వద్ద ఎక్కువగా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు 800 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అందులో అన్ని ప్రైవేటు బంకులే. 6 బంకులు మాత్రం పౌర సరఫరాల శాఖ తరుపున నడిచే బంకులు ఉన్నాయి.

పెట్రోల్, డీజిల్ కొరతపై సివిల్ సప్లై మంత్రి గంగుల కమలాకర్ పలు సార్లు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయిల్ కంపెనీలైన ఐవోసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ ప్రతినిధులుపెట్రోల్ బంకుల యాజమాన్యాలతో పెట్రోల్, డీజిల్ కొరత అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. పెట్రోల్ బంకుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎక్కడా కొరత లేకుండా చూడాలని మంత్రి గంగుల ఆదేశించారు. అయినా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెట్రోల్ బంక్‌లలో నో స్టాక్ బోర్డ్స్ దర్శనం ఇస్తున్నాయి. 

Full View


Tags:    

Similar News