Telangana: 12 క్రయోజెనిక్‌ ట్యాంకర్లు తెప్పించండి.. సీఎం కేసీఆర్‌ ఆదేశం

Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌పై కేసీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. కరోనా కేసులను నిరోధించడానికి లాక్‌డౌన్ పరిష్కారం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Update: 2021-05-07 04:55 GMT

Telangana: 12 క్రయోజెనిక్‌ ట్యాంకర్లు తెప్పించండి.. సీఎం కేసీఆర్‌ ఆదేశం

Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌పై కేసీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. కరోనా కేసులను నిరోధించడానికి లాక్‌డౌన్ పరిష్కారం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్, రెమిడెసివర్, టీకా డోసులను ఇవ్వాలని కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల రోగులతో తెలంగాణపై భారం పడుతోందని ప్రధానమంత్రికి ఫోన్‌లో వివరించారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావొద్దని సీఎం సూచించారు.

తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లో లాక్‌డౌన్‌ విధించబోమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌తో ప్రజాజీవనం స్తంభించిపోతుందని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే అవకాశం ఉందన్నారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా కేసుల సంఖ్య తగ్గడం లేదన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్యారోగ్య శాఖ అధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షించారు. కరోనా చికిత్స, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై ప్రధానంగా చర్చించారు.

రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్‌, వ్యాక్సిన్లు, రెమ్‌డెసివిర్‌ సరఫరాపై ప్రధాని మోదీతో కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. వాటిని తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాలని ప్రధానిని కోరారు. తమిళనాడులోని పెరంబదూర్, కర్ణాటకలోని బళ్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్‌ అందడం లేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు కరోనా బాధితులు రావడం వల్ల భారం పెరిగిందని ప్రధానికి సీఎం వివరించారు. రాష్ట్రానికి రోజుకు 440 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందుతోందని దానిని 500 మెట్రిక్‌ టన్నులకు పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు 4,900 మాత్రమే అందుతున్నాయని ఆ కోటాను 25 వేలకు పెంచాలని కోరారు. కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రానికి 50 లక్షల డోసులను సరఫరా చేసిందన్నారు.

రాష్ట్రంలో రోజుకు రెండు నుంచి 2.5 లక్షల డోసులు అవసరం ఉందని కేసీఆర్‌ చెప్పారు. వాటిని సత్వరమే సరఫరా చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ సీఎం కేసీఆర్‌తో మాట్లాడారు. ప్రధాని మోదీకి కేసీఆర్‌ విన్నవించిన అంశాలన్నింటినీ సత్వరమే తెలంగాణకు సమకూరుస్తామని గోయల్‌ తెలిపారు. ఆక్సిజన్‌ను కర్ణాటక, తమిళనాడు నుంచి కాకండా తూర్పు రాష్ట్రాల నుంచి సరఫరా జరిగేలా చూస్తామన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతవరకు ఆక్సిజన్‌ అందుతుందని ఇంకా ఎంత కావాలి? వ్యాక్సిన్లు ఎంతమేరకు అందుబాటులో ఉన్నాయనే అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రెమ్‌డెసివిర్‌ తయారీ సంస్థలతో ఫోన్‌లో మాట్లాడిన కేసీఆర్ వాటి లభ్యతను మరింత పెంచాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,500 ఆక్సిజన్‌ పడకలు ఉన్నాయని వాటిని హైదరాబాద్‌ సహా జిల్లాల్లో కలిపి వారం రోజుల్లో మరో ఐదు వేలకు పెంచాలన్నారు. మెరుగైన ఆక్సిజన్‌ సరఫరా కోసం ఒక్కొక్కటి రూ.కోటి చొప్పున 12 క్రయోజెనిక్‌ ట్యాంకర్లను చైనా నుంచి వాయు మార్గంలో అత్యవసరంగా దిగుమతి చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు.

కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావొద్దని సీఎం సూచించారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే కొవిడ్‌ మెడికల్‌ కిట్లను వినియోగించుకోవాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ఇంటింటికీ అందజేస్తామన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు మందులు అంజేస్తారని వివరించారు.

Tags:    

Similar News