Revised Lands Charges: తెలంగాణలో అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు

* సవరించిన భూముల విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు * 7.5శాతం పెరిగిన రిజిస్ట్రేషన్‌ రుసుము

Update: 2021-07-22 06:22 GMT

రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ( ఫోటో: ది హన్స్ ఇండియా )

Telangana: తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. సవరించిన భూముల విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. భూముల విలువను ప్రభుత్వం మూడు స్లాబులుగా విభజించింది. ఆయా ప్రాంతాల్లో భూముల విలువ ప్రకారం 50శాతం, 40శాతం, 30శాతం చొప్పున పెంచింది. అలాగే, రిజిస్ట్రేషన్ రుసుము ఏడున్నర శాతం పెంచడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ, ధరణి పోర్టల్‌లో మార్పులు చేశారు. దాంతో, ఈరోజు నుంచి పెరిగిన ఛార్జీలకు అనుగుణంగా అదనపు రుసుం వసూలు చేయనున్నారు. పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లకు కూడా పెరిగిన ధరల ఆధారంగానే ఛార్జీలు వసూలు చేయనున్నారు.

Tags:    

Similar News