Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద
Nagarjuna Sagar: 14 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల.. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1,63,089 క్యూసెక్కులు
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో లక్షా 63వేల క్యూసెక్కులుగా ఉంది. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.90 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 311.4 టీఎంసీలకు చేరింది. ఇక జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.