Sangareddy: మున్సిపాలిటీకి డంపింగ్ యార్డు సమస్య.. రెండు వారాలుగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన చెత్త..

Arutla Village: సంవత్సరం తరువాత మళ్లీ రూ.25 లక్షలు ఇవ్వాలని గ్రామస్తుల డిమాండ్

Update: 2023-06-14 11:49 GMT

ఆరుట్ల గ్రామానికి రూ.50 లక్షలు చెల్లించిన మున్సిపాలిటీ

Arutla Village: గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా పేరుగాంచిన సంగారెడ్డి మున్సిపాలిటీకి డంపింగ్ యార్డు లేకపోవడంతో ఓగ్రామంలో చెత్త వేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ గ్రామ ప్రజలు రెండు వారాల నుంచి చెత్తవేయడాన్ని అడ్డకుంటున్నారు. దీంతో మున్సిపాలిటీలో ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోయింది.

సంగారెడ్డి మున్సిపాలిటీకి డంపింగ్ యాడ్ గండం ఉంది. మున్సిపాలిటీ ఏర్పాటు అయిన తరువాత నుంచి ఇప్పటి వరకూ డంపింగ్ యార్డ్ లేదు. ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం అధికారులకు పెద్ద టాస్క్ లాగా మారింది. సంగారెడ్డి మున్సిపల్‌ పరిధిలో సేకరించిన చెత్తను డంప్‌ చేయడానికి చుట్టుపక్కల మండలాల్లో ఎక్కడా ప్రజలు అంగీకరించడం లేదు. అనేక ప్రయాత్నాల అనంతరం కంది మండలం ఆరుట్లలో చెత్త వేయడానికి ఏడాది క్రితం అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఆరుట్ల గ్రామ అభివృద్ధి కోసం సంగారెడ్డి మున్సిపాలిటీ 50 లక్షల రూపాయలు చెల్లించిది. సంవత్సరం గడిచిపోవడంతో ఇప్పడు మళ్లీ 25 లక్షల రూపాయలు చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకూ చెత్తవేయడానికి అనుమతించమంటున్నారు. దీంతో రెండు వారాలుగా ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోయింది.

సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్నది వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్రబలే అవకాశముందంటున్నారు. వెంటనే డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు

Tags:    

Similar News