MLC Kavitha: మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలుకు భారత్ జాగృతి న్యాయపోరాటం
MLC Kavitha: రిజర్వేషన్ అంశంపై సుప్రీంకోర్టులో.. పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లో ఇంప్లీడ్ అవుతామన్న కవిత
MLC Kavitha: మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలు కోసం భారత జాగృతి న్యాయపోరాటం చేస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవుతామన్నారు. ఇప్పటికైనా కేంద్రం సానుకూలంగా స్పందించాలన్న ఆమె 2024 సార్వత్రిక ఎన్నికల నుంచైనా రిజర్వేషన్లను అమలు చేసేలా చర్యలు చేపట్టాలి డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టం తక్షణ అమలు కోసం భారత జాగృతి తరఫున న్యాయపోరాటం చేసేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని తెలిపారు. న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీం కోర్టులో రిజర్వేషన్ అంశంపై పెండింగ్ లో ఉన్న పిటిషన్ లో ఇంప్లీడ్ అవుతామని వెల్లడించారు.
మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధించుకున్నామన్న కవిత వాటి తక్షణ అమలు కోసం కూడా మరో పోరాటానికి సిద్ధమయ్యామని కవిత తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని తక్షణ అమలు కోసం పలు రాజకీయ పార్టీలు, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయన్న ఆమె.. అదే అంశంపై ఇప్పటికే పలు పార్టీలు,సంస్థలు కోర్టుకు వెళ్లాయని ప్రస్థావించారు. ప్రస్తుతం రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుందన్న కవిత భారత్ జాగృతి తరపున తాము కూడా న్యాయపరంగా ముందుకెళ్లే అంశంపై చర్చలు జరుపుతున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే న్యాయ నిపుణుల సలహా మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న పిటిషన్ లో తాము ఇంప్లీడ్ అవుతామన్నారు.