Seethakka: తాగునీటి సమస్యలు తలెత్తకూడదు.. మిషన్ భగీరథపై మంత్రి సీతక్క సమీక్ష
Seethakka: వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలి
Seethakka: వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని తెలంగాణ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథపై సమీక్ష నిర్వహించిన సీతక్క.. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. రిజర్వాయర్లు, నదుల వంటి తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌లో తాగునీటి అవసరాల నిమిత్తం ప్రతి నియోజకవర్గంలో ఒక కోటి రూపాయలు కేటాయించారని సీతక్క తెలిపారు. మిషన్ భగీరథ ఇంజనీర్లు క్షేత్రస్థాయి అవసరాలను గమనించి జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు.