Seethakka: ఇంద్రవెల్లి స్మృతి వనం ఏర్పాటుకు మంత్రి సీతక్క భూమి పూజ
Seethakka: పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు
Seethakka: ఇంద్రవెల్లి స్థూపం వద్ద స్మృతి వనం ఏర్పాటుకు మంత్రి సీతక్క భూమి పూజ చేశారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. అమరవీరుల స్తూపంతో పాటు నాగోబా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి మాటిచ్చారని.. నేడు ఆ మాటను నిలబెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తోందన్నారు మంత్రి. నాడు అడవి బిడ్డల పోరాట ఫలితంగానే అటవీపై హక్కులు దక్కాయని మంత్రి సీతక్క గుర్తు చేశారు.