దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య సిద్దిపేటలో చోటుచేసుకున్న ఘర్షణపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పందించారు. సోమవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాకలో ఓటమి భయంతోనే బీజేపీ నేతలు కొత్త నాటకాలు తెరపైకి తీసుకొస్తున్నారన్నారు మంత్రి హరీశ్ రావు. తనిఖీల్లో డబ్బులు దొరకగానే రివర్స్ డ్రామా ప్లే చేస్తున్నారన్నారు. దొంగే దొంగా.. దొంగా.. అన్న తీరుగా బీజేపీ ప్రవర్తిస్తుందని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో బీజేపీ ఖాళీ అవుతోందని.. ఆ ఫ్రస్ట్రేషన్‌తోనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో పోటీ చేసేవాళ్లకు డబ్బుతో ఏం అవసరం. డబ్బుతో రాజకీయాలు చేస్తారా? అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. పోలీసులు తనిఖీలు చేస్తే భయపడాల్సిన అవసరం వారికి ఏమొచ్చింది. పోలీసుల మీద పడి గుండాల్లా వ్యవహరించి డబ్బులు గుంజుకోవడం దుర్మార్గం అని హరీశ్ మండిపడ్డారు.