Lockdown in Telangana: తెలంగాణలో అమలులోకి లాక్ డౌన్

Lockdown in Telangana: తెలంగాణలో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించింది.

Update: 2021-05-12 05:15 GMT

Lockdown in Telangana: తెలంగాణలో అమలులోకి లాక్ డౌన్

Lockdown in Telangana: తెలంగాణలో లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించింది. ఉదయం 10గంటల నుంచి లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి (మే 12 నుంచి 21 వరకు) పదిరోజుల పాటు లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు (నాలుగు గంటలు) కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నాలుగు గంటలే సడలింపు ఇవ్వడంతో మార్కెట్లలో రద్దీ కనిపిస్తోంది. నిత్యావసరాల కోసం ఉదయం నుంచి జనం క్యూకట్టారు.

లాక్ డౌన్ విధించడంతో సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీ కనిపించింది. లాక్‌డౌన్‌ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అత్యవసర సేవలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని వెనక్కి పంపుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ పరీక్షలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

Tags:    

Similar News