Rythu Runamafi:బిగ్ అలర్ట్..నేడే రుణమాఫీ నిధులు విడుదల..రైతు ఖాతాల్లోకి రూ.7వేల కోట్లు

Rythu Runamafi:తెలంగాణలోని అన్నదాతలకు గుడ్ న్యూస్. నేడు రైతు రుణమాఫీ నిధులు విడుదల కానున్నాయి. ఈరోజు సాయంత్రం 4గంటలకు రూ. 7వేల కోట్లు రైతు ఖాతాల్లోకి జమకానున్నాయి.

Update: 2024-07-18 00:21 GMT

Rythu Runa Mafi: గురుపౌర్ణమి సందర్భంగా రైతులకు శుభవార్త..రెండో విడత రుణమాఫీపై కీలక అప్‎డేట్

Rythu Runamafi:తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. తాజాగా ఆగస్టులోపే మూడు దశల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. గురువారం సాయంత్రం 4గంటలకు రూ. 7వేల కోట్లు రుణమాఫీ రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందన్నారు. ప్రతిరైతుకు రుణవిముక్తి కల్పించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో కాంగ్రెస్ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. గడచిన 7నెలల పాలనపై సీఎం సమీక్షించారు.

ఈ రోజు (గురువారం) లక్ష రూపాయల వరకు రైతు రుణాలకు నిధులను విడుదల చేస్తాము. ఈనెలాఖరులోపు రూ.1.5లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ జరుగుతుంది. ఆగస్టులో రూ.2లక్షల వరకు రైతు రుణాలు మాఫీ. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తుశుద్ధి ఉందని..ఒకే విడతలో రూ. 2లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది. అనుకున్న సమయానికి లక్షలోపు రుణాలను రైతులకు చెల్లించేందుకు సిద్ధమయ్యింది. 7 నెలల ప్రభుత్వ కాలంలో రాష్ట్ర రైతాంగానికి రుణమాఫీ కింద రూ. 30వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంత పెద్ద మొత్తాన్ని ఎలా తీసుకువస్తుందన్న సందేహాల మధ్య కేవలం ఎప్ఆర్బీఎమ్ పరిధికిలోబడి తీసుకున్న రుణాలతోపాటు రాష్ట్రానికి ఇతర మార్గాల్లో వచ్చిన ఆదాయాన్ని దీనికి ఖర్చు చేస్తోంది. అలా భద్రపరిచిన నగదు నుంచే గురువారం జులై 18న 7వేల కోట్ల రూపాయలు మొదటి విడత రైతు రుణమాఫీ కోసం చెల్లిస్తోంది.

తొలివిడత రుణమాఫీ జులై 18న చెల్లిస్తుంటే..రెండో విడతలో లక్షన్నర రుణమాఫీ ఉన్నవారికి నెలాఖారులోగా చెల్లించనుంది. ఇక రెండు లక్షలకుపైగా ఉన్నవారికి వచ్చేనెల అంటే ఆగస్టులో చెల్లించనుంది. దీనికి తగిన విధంగానే మొత్తం నిధులను రాష్ట్ర ఖజానాలో రెడీగా ఉంచుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News