అన్‌లాక్ తర్వాత హైదరాబాద్‌లో అరకొరగా బస్సులు
Hyderabad: అన్‌లాక్ తర్వాత తెలంగాణలో బస్సులను పరిమిత సంఖ్యలో నడిపిస్తున్న టీెఎస్ ఆర్టీసీ యాజమాన్యం
Hyderabad: అన్‌లాక్ తర్వాత తెలంగాణలో బస్సులు పరిమిత సంఖ్యలో నడుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలకు బస్సులు అరకొరగా ఉన్నాయి. దీంతో అర్జెంట్‌గా వేరే ప్రాంతానికి వెళ్లాలనుకునే వారు గంటల తరబడి బస్టాప్‌లలో వేయిట్ చేస్తున్నారు. అటు బస్సులు సరిగ్గాలేక పోవడంతో విద్యార్థులు స్కూల్స్, కాలేజీలకు సమయానికి వెళ్లడం లేదు.
హైదరాబాద్ పరిధిలో 29 డిపోలు, 2వేల 500 బస్సులు
హైదరాబాద్ పరిధిలోని 29 డిపోలలో 2వేల 500 బస్సులు నడుస్తున్నాయి. ఈ బస్‌లను వేయి 150 రూట్లలో 40వేల ట్రిప్పులు నడుపుతోంది టీఎస్‌ఆర్టీసీ. అయితే ప్రధాన బస్‌స్టేషన్‌లలో మినహా మిగితా బస్ స్టాప్‌లలో బస్సుల రాకపోకలకు సంబంధించిన వివరాలు కనిపించడం లేదు. ఇదిలా ఉండగా.. లాక్‌డౌన్ తర్వాత బస్సులు పున:రుద్ధరించినప్పటికీ బస్సులు మాత్రం సమయానికి రావడం లేదు.
స్కూల్స్, కాలేజీలు ప్రారంభమైనా అరకొరగా బస్సులు
అటు బస్సులు సరిగ్గా లేక, ఇటు సమయానికి రాకపోవడంతో ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాలేజ్, స్కూల్స్ ప్రారంభమైనా బస్సులు అరకొరగానే నడుస్తున్నాయంటున్నారు. పరిమిత సంఖ్యలో బస్సులు ఉండటంతో నిలబడటానికి కూడా ప్లేస్ లేదని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సులు కూడా ఎక్కువగా లేకపోవడంతో విద్యార్థులు సూల్స్, కాలేజీలకు లేటుగా వెళ్తున్నారంటున్నారు.
మార్చి 1 నుండి బస్సుల సంఖ‌్యను పెంచుతాం-ఆర్టీసీ అధికారులు
మరోవైపు ఆర్టీసీ అధికారులు మాత్రం.. ప్రయాణికులు తక్కువ సంఖ్యలోనే ఉన్నందువల్ల పరిమిత సంఖ్యలో బస్సులు నడుపుతున్నామంటున్నారు. విద్యాసంస్థలు ప్రారంభంకావడంతో ఇప్పుడు మరికొన్ని బస్సులు కేటాయించామని చెబుతున్నారు. మార్చి 1 నుండి బస్సుల సంఖ్యను మరింత పెంచుతామని ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.