ఎన్నికలను నిలుపుదల చేయాలని హైకోర్టును కోరిన న్యాయవాది రచన రెడ్డి
* కార్పొరేటర్ల రిజర్వేషన్లు సక్రమంగా జరగలేదని ఆరోపణ * పోలింగ్‌కు వారం రోజులే గడువు.. ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం: హై కోర్టు * ఎన్నికల పిల్స్, రిట్ పిటిషన్లు డిసెంబర్ 23న విచారిస్తాం: హై కోర్టు
జీహెచ్ఎంసీ ఎన్నికలపై తాము ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మున్సిపల్ యాక్ట్ ప్రకారం మేయర్, కార్పొరేటర్ల రిజర్వేషన్లు సక్రమంగా జరగలేదని, వెంటనే ఎన్నికలను నిలుపుదల చేయాలని న్యాయవాది రచనారెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. అయితే పోలింగ్‌కు వారం రోజులే గడువున్న నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. గ్రేటర్ ఎన్నికలపై వేసిన పిల్స్, రిట్ పిటిషన్లు అన్నీ కలిపి విచారిస్తామన్న కోర్టు.. తదుపరి విచారణను డిసెంబర్ 23కు వాయిదా వేసింది.