Ambedkar Statue: హైదరాబాద్‌లో భారీ అంబేద్కర్ విగ్రహం.. చివరి దశకు చేరుకున్న నిర్మాణ పనులు

Ambedkar Statue: ఏప్రిల్ 14న జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ

Update: 2023-04-10 11:30 GMT

Ambedkar Statue: హైదరాబాద్‌లో భారీ అంబేద్కర్ విగ్రహం.. చివరి దశకు చేరుకున్న నిర్మాణ పనులు   

Ambedkar Statue: హైదరాబాద్ నగరంలో దేశ రాజ్యాంగ నిర్మాత, భావి భారత స్ఫూర్తిప్రదాత బాబాసాహెబ్ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల ఎత్తయిన భారీ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యం లోనే విగ్రహ నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు.

విగ్రహా ఆవిష్కరణకు పనులు దాదాపు ఇప్పటికే పూర్తికాగా , చివరి దశ పనులు అధికారులు చకాచకా పూర్తి చేస్తున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో 125 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం. అయితే తెలంగాణకే మణిహారంగా నిలవనున్న ఈ విగ్రహం నెక్లెస్‌ రోడ్డులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఒకవైపు రాష్ట్ర పరిపాలన కేంద్రమైన నూతన సచివాలయం మరోవైపు అమరుల స్మారకం, ఇంకోవైపు అంబేద్కర్ భారీవిగ్రహం హైదరాబాద్ కు తలమానికంగా నిలవనున్నాయి.

Tags:    

Similar News