KTR: సిరిసిల్ల‌కు మెగా ప‌వ‌ర్ లూమ్ క్ల‌స్ట‌ర్ తీసుకురండి.. బండి సంజ‌య్‌కు కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌

KTR: ఈసారి కేంద్ర బడ్జెట్ లో సిరిసిల్లకు గుడ్ న్యూస్ వచ్చేలా  చూడాలని సూచన

Update: 2024-07-11 11:19 GMT

KTR: సిరిసిల్ల‌కు మెగా ప‌వ‌ర్ లూమ్ క్ల‌స్ట‌ర్ తీసుకురండి.. బండి సంజ‌య్‌కు కేటీఆర్ బ‌హిరంగ లేఖ‌

KTR: ఈసారి కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తీసుకురావాల‌ని కోరుతూ కేంద్రమంత్రి బండి సంజజ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పదేళ్లుగా ప్రతి బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు మొండిచెయ్యి చూపింద‌ని గుర్తు చేశారు. అనేకసార్లు పవర్‌లూమ్ క్లస్టర్ కోసం పది సార్లు కేంద్రానికి లేఖలు, స్వయంగా కలిసి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు కేటీఆర్. ఈ సారైనా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్‌ను తెప్పించండి. కేంద్ర మంత్రిగా మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు శుభ‌వార్త అందేలా చూడాల‌ని బండి సంజ‌య్‌ను కేటీఆర్ కోరారు.


Tags:    

Similar News