KCR: రేపటి నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన
KCR: ఎండిన పొలాలను పరిశీలించనున్న కేసీఆర్
KCR: తెలంగాణలో రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పోరు బాట పట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు పంటల పరిశీలనలో ఉండగా.. ఇప్పుడు ఆ పార్టీ అధినేత కేసీఆరే రంగంలోకి దిగుతున్నారు. రేపటి నుంచి గులాబీ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. రేపు జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో కేసీఆర్ పర్యటిస్తారు. అక్కడినుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని అర్వపల్లికి వెళ్తారు. ఆ తర్వాత నల్లగొండ జిల్లా హాలియా మండలంలో ఎండిన పంటలను పరిశీలించి..రైతుల సమస్యలను తెలుసుకుంటారు..
రాష్ట్రంలో పలు చోట్ల పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో..రేవంత్ సర్కార్ టార్గెట్‌గా బీఆర్ఎస్ విమర్శలు గుప్పి్స్తోంది.. ఇది కాలం తెచ్చిన కరువు కాదని..కాంగ్రెస్ తెచ్చిన కరువని ఆరోపణలు చేస్తున్నారు గులాబీ నేతలు. పంటలు ఎండిపోతున్నా..ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు. ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన ఏ ఒక్కహామీని రేవంత్ సర్కార్ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. రైతు రుణమాఫీ మొదలుకుని రైతు భరోసా, పంటలకు బోనస్ వంటి హామీల సంగతేంటని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్.