KCR: పొలాలబాట పట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
KCR: జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఒకేరోజు పర్యటన
KCR: తెలంగాణలో ఓవైపు లోక్ సభ ఎన్నికల హడావుడి నడుస్తుండగా.. మరోవైపు కరవు పరిస్థితులు కలవరపెడుతున్నాయి. అకాల వర్షాలతో పంటలు దెబ్బతినటమే కాదు.. సాగునీరు అందక పంటలు ఎండిపోయి అల్లాడుతున్న అన్నదాతలకు అండగా ఉండేందుకు.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఉన్నపళంగా పొలాల బాటపట్టారు కేసీఆర్. ఇవాళ ఒక్కరోజే 3 జిల్లాలో పర్యటించనున్నారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించనున్నారు. పలువురు రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు.
ఎర్రవెల్లి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉదయం 10 గంటల 30 నిమిషాలకు జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు చేరుకోనున్నారు. అక్కడ ఎండిన పంటలను పరిశీలించి.. 11 గంటల 30 నిమిషాలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించి.. పంట పొలాలను పరిశీలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు జరిగిన పర్యటన.. పంట పొలాలపై చేసిన పరిశీలపనపై సాయంత్రం ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు.