నేడు తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
KCR: కృష్ణా పరివాహక ప్రాంత నేతలతో భేటీకానున్న కేసీఆర్
KCR: తుంటి ఆపరేషన్ కారణంగా విశ్రాంతిలో ఉన్న గులాబీ బాస్ తిరిగి రాజకీయ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా మారబోతున్నారు. పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌లో అడుగుపెట్టబోతున్నారు.
ఇవాళ తెలంగాణ భవన్‌లో కృష్ణా పరివాహక ప్రాంతంలోని బీఆర్ఎస్ నేతలతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశం కానున్నారు. ఉదయం 11గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు సమావేశానికి హాజరుకావాలని కేసీఆర్ ఆదేశించారు. కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం KRMBకి అప్పగించడంపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రాజెక్టుల విషయంలో భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
మరోవైపు అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపైనా బీఆర్ఎస్ నేతలతో చర్చించనున్నారు కేసీఆర్. శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగట్టే అంశాలపై కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల అనంతరం నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభపై కూడా ఇవాళ్టి సమావేశంలో చర్చించనున్నారు. ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌కు గులాబీ బాస్ రానుండటంతో.. పార్టీ శ్రేణులు భారీగా అధినేతను చూసేందుకు భారీగా తరలివచ్చే అవకాశాలున్నాయి.