MLC Kavitha: ధర్మ పరిరక్షణే సీఎం కేసీఆర్ ధ్యేయం..

MLC Kavitha: ధర్మ పరిరక్షణే సీఎం కేసీఆర్ ధ్యేయం అన్నారు ఎమ్మెల్సీ కవిత.

Update: 2023-01-30 10:00 GMT

MLC Kavitha: ధర్మ పరిరక్షణే సీఎం కేసీఆర్ ధ్యేయం..

MLC Kavitha: ధర్మ పరిరక్షణే సీఎం కేసీఆర్ ధ్యేయం అన్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రభుత్వ చర్యలతో తెలంగాణలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందన్నారు. వేల కోట్లతో దేవాలయాలను అభివృద్ధి చేశారని కొనియాడారు. నిజాబాద్ జిల్లా నందిపేట్ మండలం పలుగుట్ట కేదారేశ్వరా‎శ్రమంలో సాధూ పరిషత్ 57వ మహాసభల్లో కవిత పాల్గొన్నారు. ఆర్మూర్ గొప్ప దైవచింతన కలిగిన నేలన్నారు. పరమశివుడి దివ్యక్షేత్రం సిద్ధులగుట్ట భక్తుల కొంగుబంగారంగా నిలుస్తుందన్నారు. పలుగుట్ట కేదారేశ్వరాశ్రమం అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సైతం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tags:    

Similar News