Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
Radisson Drugs Case: రాడిసన్ హోటల్‌లో పదిసార్లకు పైగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు గుర్తింపు
Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రధాన నిందితుడు వివేకానంద్ ఆదేశాలతో డ్రైవర్ ప్రవీణ్‌కు పెడ్లర్ మీర్జా వాహిద్ డ్రగ్స్‌ను అందజేశారు. స్నాప్ చాట్ చేస్తూ డ్రగ్స్‌ను ముఠా డెలివరీ చేసింది. డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ అలీ ద్వారా వివేకానంద్‌కు డ్రగ్స్ సరఫరా చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి నెలలోనే 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. మిర్జా వహీద్ బేగ్ రిమాండ్ రిపోర్ట్‌లో మరోసారి డైరెక్టర్ క్రిష్ పేరును పోలీసులు ప్రస్తావించారు.
రాడిసన్ హోటల్‌లో పదిసార్లు పైగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. రెండు గ్రాములకు 30 వేలు గూగుల్ పే ద్వారా చెల్లించారు. ఫిబ్రవరి 24న కొకైన్ పార్టీలో 10 మంది నిందితులు హాజరయ్యారని రిమాండ్ రిపోర్టులు తెలిపారు. మీర్జా వాహిద్ ఫిలింనగర్, గచ్చిబౌలి ISB , జూబ్లీహిల్స్ లో కొకైన్ ను అందజేసినట్లు అధికారులు గుర్తించారు.