రేవంత్‌రెడ్డిని ఆ మైక్ ఇబ్బంది పెడుతోందా..? మైక్‌ ఆగితే ఉద్యోగాలు పోతాయని..

Revanth Reddy: తన వాక్చాతుర్యంతో రాజకీయ ప్రత్యర్ధుల నోళ్లు మూయించే రేవంత్‌రెడ్డిని ఆ మైక్ ఇబ్బంది పెడుతోందా..?

Update: 2022-01-12 09:42 GMT

రేవంత్‌రెడ్డిని ఆ మైక్ ఇబ్బంది పెడుతోందా..? మైక్‌ ఆగితే ఉద్యోగాలు పోతాయని..

Revanth Reddy: తన వాక్చాతుర్యంతో రాజకీయ ప్రత్యర్ధుల నోళ్లు మూయించే రేవంత్‌రెడ్డిని ఆ మైక్ ఇబ్బంది పెడుతోందా..? రేవంత్ మాట మైక్ విననంటుందా లేక తన సిబ్బంది విననంటున్నారా...? ఆ మైక్ చేస్తున్న పనితో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గాంధీభవన్‌ సిబ్బంది వణికిపోతున్నారా..? అసలు మైక్‌ పట్టిస్తున్న ముచ్చెమటలేంటో తెసుసుకోవాలా..?

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్తబాస్‌గా వచ్చిన రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌కు కార్పొరేట్‌ లుక్‌ను తీసుకువచ్చేందుకు చాలానే కష్టపడ్డారు. రి కన్‌స్ట్రక్షన్‌ కోసం రెండు నెలల సమయం కేటాయించి సుమారు 3 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారు. రేవంత్ ఛాంబర్ నుంచి ప్రతినేత ఛాంబర్‌ను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. ఇంతచేసినా రేవంత్‌ను ఓ సమస్య కంట్లో నలుసులా వెంటాడుతోంది. ఆ సమస్య గాంధీభవన్‌ సిబ్బందిని వణికిస్తోంది.

గాంధీభవన్‌లోని మీడియా రూమ్ రేవంత్‌రెడ్డిని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఆయన మాట్లాడేది బయట ప్రపంచానికి తెలియాలంటే మీడియా హాల్‌లో మైక్‌ చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ సమస్యే అది. రేవంత్‌రెడ్డి నుంచి జాతీయనేత మల్లికార్జున్‌ ఖర్గే లాంటి నేతలు మాట్లాడుతున్న సమయంలో ఆ మైక్ మొరాయిస్తోంది. నిత్యం టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పెడుతోంది. ఇదివరకే పలుమార్లు ఈ సమస్య రేవంత్‌ను తీవ్ర అసహనానికి గురిచేసింది. అయితే అప్పట్లో గాంధీభవన్‌ సిబ్బంది టెక్నీషియన్స్‌ను తీసుకొచ్చి ప్రాబ్లమ్‌ సాల్వ్ చేయించినా మళ్లీ మళ్లీ రిపీట్‌ అవుతోంది.

ఇక మంగళవారం గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతుండగా మధ్యలో మైక్‌ మరోసారి కట్ అయింది. దీంతో సిబ్బందిపై రేవంత్‌ ఫైరయ్యారు. మైక్ కేబుల్స్‌ అన్నీ ఛేంజ్‌ చేశామని అయినప్పటికీ సమస్య వస్తుందని సిబ్బంది రేవంత్‌కు చెప్పారట. దీంతో రేవంత్‌కు చిర్రెత్తుకొచ్చి ఇంకోసారి మైక్‌ సరిగా పనిచేయకపోతే మీ ఉద్యోగాలు ఉండవని హెచ్చరించారని టాక్. దీంతో గాంధీభవన్‌ సిబ్బందికి ఎప్పుడు ఏం జరుగుతుందోనని చెమటలు పడుతున్నాయట. ఆ మైక్‌ ఎక్కడ తమ ఉద్యోగాలకు ఎసరు పెడ్తుందోనని వెంటనే దానిని ఛేంజ్‌ చేసే ప్రయత్నాలు ప్రారంభించారట.

Tags:    

Similar News