నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం

Nampally: బిల్డింగ్ పటిష్టతను పరిశీలించనున్న JNTU బృందం

Update: 2023-11-14 03:45 GMT

నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం

Nampally: నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బిల్డింగ్‌ పటిష్టతను JNTU బృందం పరిశీలించనుంది. ఘటన జరిగిన వెంటనే భవనం యజమాని.. రమేష్ జైశ్వాల్ ఆస్పత్రిలో చేరారు. రమేష్‌పై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 304, 285, 286 సెక్షన్ 9 క్లాజ్ బీ కింద కేసులు నమోదయ్యాయి. రమేష్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగానే అదుపులోకి తీసుకుంటామంటున్నారు పోలీసులు.

హైదరాబాద్ నాంపల్లి బజార్‌ఘాట్‌ అపార్ట్‌మెంట్‌‌‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. భవనం కింది భాగంలో కెమికల్స్‌ నిల్వ చేయడంతో మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లో భవనం మొత్తం మంటల్లో చిక్కుకుపోవడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆరు బైకులు, కారు కూడా తగులబడ్డాయి.

ఐదంతస్తుల భవనంలో 15 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వెంటనే అందులో నివాసం ఉంటున్న వారిని స్థానికులు అప్రమత్తం చేశారు. నిచ్చెనల ఆధారంగా వారిని కిందకు దించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న డీజిల్‌ డ్రమ్ములపైకి టపాసులు దూసుకు రావడంతో.. మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా భవనంలోని సెల్లార్‌ మొత్తం అగ్నికి ఆహుతైంది.

Tags:    

Similar News