హైదరాబాద్‌లో ముగిసిన ఇండియన్ రేసింగ్ లీగ్

* రేసింగ్ లీగ్ లేకుండానే ముగిసిన లీగ్.. అర్ధాంతరంగా ఆగడంతో ప్రేక్షకులకు నిరాశ

Update: 2022-11-21 02:07 GMT

హైదరాబాద్‌లో ముగిసిన ఇండియన్ రేసింగ్ లీగ్

Indian Racing League: హైదరాబాద్ వాసులకు రెండు రోజుల పాటు కొనసాగిన ఇండయన్ రేసింగ్ లీగ్ ఆదివారంతో ముగిసింది. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో ఆసక్తికరంగా సాగిన రేస్‌లను వీక్షించేందుకు నగరవాసులు ఎగబడ్డారు. భాగ్యనగరంలో మొట్టమొదటి సారి ఈ పోటీలు జరగగా స్వల్ప ప్రమాదాల కారణంగా రేస్‌లు పూర్తి కాలేదు. కొత్త ట్రాక్‌పై శనివారం రేసర్లు ప్రాక్టీస్ చేయగా ఆదివారం క్వాలిఫయింగ్ రౌండ్‌తో పాటు ప్రధాన పోటీలు జరగాల్సి ఉండగా ట్రాక్‌లో రెండు కార్లు ఢీకొనడంతో సమయాభావం వల్ల మొత్తం రేస్‌లు నిర్వహించలేకపోయారు. వచ్చే ఏడాది ఇదే ట్రాక్‌పై ఫార్ములా- ఈరేస్ జరగాల్సి ఉండగా.. దానికి సన్నాహకంగా ఇండియన్ రేసింగ్ లీగ్‌ను నిర్వహించారు.

ఈ పోటీల్లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్‌తో సహా ఆరు జట్లు పాల్గొన్నాయి. ఇండియన్ రేసింగ్ లీగ్ అనంతరం జేకే టైర్స్ గోకార్డింగ్ కార్లు కూడా ట్రాక్‌పై పరుగులు పెట్టాయి. రెండో రోజు రేసింగ్‌ లీగ్‌లో మధ్యాహ్నం స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళా రేసర్‌తో పాటు మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం తిరిగి పోటీలను కొనసాగించారు. చెన్నై టర్బో రైడర్స్‌ మహిళా రేసర్‌కు గాయాలైనట్లు నిర్వాహకులు తెలిపారు. క్వాలిఫైయింగ్‌ రేసులో గోవా ఏసెస్‌ రేసింగ్‌ కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా రేసింగ్‌ ఆలస్యమైందని, రేసింగ్‌లో ఇలాంటివి సహజమేనని నిర్వాహకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా లైటింగ్‌ తగ్గడంతో రేసింగ్‌ లీగ్‌ను పూర్తి చేయకుండానే ముగించారు. మళ్లీ రెండో విడత పోటీ వచ్చే నెల 10, 11న ఇదే ట్రాక్‌పై నిర్వహించనున్నారు. 

Tags:    

Similar News