Mahbubnagar: మహబూబ్‌నగర్‌లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
Mahbubnagar: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు వ్యతిరేకంగా నిరసన
Mahbubnagar: పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ పిలుపు మేరకు రెండోరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. హన్వడ మండల కేంద్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సిలిండర్ వద్దు కట్టెల పొయ్యే వాడాలి అనే రీతిలో స్థానిక మహిళలతో కలిసి కట్టెల పొయ్యి మీద వంట చేశారు. అనంతరం ధర్యా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎనిమిదేళ్ల కాలంలో కేంద్రం చేసింది శూన్యమన్నారు. జీఎస్టీ పెంచటం.. నిత్యావసర ధరలు పెంచడం.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం తప్ప కేంద్రానికి మరోకటి చేతకాదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి కోసం పనులు చేస్తుంటే.. దానికి వ్యతిరేకంంగా కేంద్రం వ్యవహరిస్తుందని విమర్శించారు.