Hanamkonda: ఇద్దరు సీఐల వివాహేతర సంబంధం గుట్టురట్టు

*సుబేదారి పోలీస్‌ స్టేషన్లో సీఐలపై వివాహేతర సంబంధకేసు నమోదు

Update: 2022-10-04 05:53 GMT

Hanamkonda: ఇద్దరు సీఐల వివాహేతర సంబంధం గుట్టురట్టు

Hanamkonda: వాళ్లది గౌరవ ప్రదమైన వృత్తి. బాధ్యతగల హోదాల్లో పనిచేస్తున్నవారు. బాధ్యతతో పనిచేసి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వాళ్లు దారి తప్పారు. ముగ్గురు పోలీసు అధికారుల కథ పోలీస్ స్టేషన్ చేరింది. పోలీస్‌స్టేష్‌న్లో నిందితులుగా నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. పోలీస్ దంపతులది ఇద్దరిదీ ఒకే హోదా, అదే హోదా ఉన్న మరో అధికారితో వివాహేతర సంబంధం, వాళ్లనే నిందితులుగా, బాధితులుగా మార్చేసింది. ఈ ప్రేమాయణం చర్చనీయాంశంగా మారింది.

పోలీసు అధికారులు నిందితులుగా మారిన ఘటన హన్మకొండ జిల్లాలో జరిగింది. ఓ మహిళా సీఐ తన కొలీగ్ అయిన మరో సీఐతో వివాహేతర సంబంధం సమస్యగా మారింది. ఇంతకీ ఆ మహిళా సీఐ భర్త పోలీస్ శాఖలో సీఐగా ఉండడం గమనించదగ్గ విషయం. భార్యపట్లఉన్న అనుమానంతో విధుల్లో ఉన్న సమయంలో వచ్చిన సమాచారంతో తన భార్య మరో సీఐతో ఉన్నపుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పద్దతిగా తనదైన శైలిలో ఆ ఇద్దరి నిందితుల వ్యవహారాన్ని సుబేదారి పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు.

హన్మకొండ రాంనగర్ మహిళా CBCID CI ఇంట్లో, మరో సీబీసీఐడీ సీఐతో కలిసి ఉన్నట్టు మహిళ ఇన్స్ పెక్టర్ భర్త మహబూబాబాద్‌లో పనిచేస్తున్న సీఐకి పక్కా సమాచారం అందింది. ఉన్నపళంగా ఇంటికొచ్చి షాకయ్యారు. తన భార్య పనిచేసే సిబిసీఐడీ డిపార్ట్మెంట్ కు చెందిన వింగ్ లోనే పనిచేస్తున్న సహచర సీఐతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఈ క్రమంలో భర్తే వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఇప్పుడీ విషయం హన్మకొండ, వరంగల్ జిల్లాలతోపాటు యావత్ తెలంగాణలోనే హాట్ టాపిక్ అయ్యింది. పోలీస్ అధికారుల బండారం బయటకు పొక్కడంతో చర్చనీయాంశంగా మరింది. సుబేధారి పోలీసులు ఐపిసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News