Hydra: హైడ్రా మరో సంచలనం.. సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి నోటీసులు..!

FTL జోన్‌లోనే సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి నివాసం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం సోదరుడి నివాసానికి కూడా నోటీసులు జారీ చేశారు.

Update: 2024-08-29 06:32 GMT

Hydra: హైడ్రా మరో సంచలనం.. సీఎం రేవంత్ సోదరుడి ఇంటికి నోటీసులు..!

Hydra: దుర్గంచెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ చేశారు. చెరువును ఆనుకొని ఉన్న ఖరీదైన భవనాలు నిర్మాణం చేపట్టారు. చెరువుకి చుట్టూ ప్రముఖుల నివాసాలు ఉన్నాయని.. అయితే ఆ నిర్మాణాలు FTL జోన్‌లో ఉన్నట్లు గుర్తించారు. వారందరికీ శేర్లింగంపల్లి తహశీల్దార్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

30 రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులో పేర్కొన్నారు. FTL జోన్‌లోనే సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి నివాసం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం సోదరుడి నివాసానికి కూడా నోటీసులు జారీ చేశారు. నెక్టార్ కాలని, డాక్టర్స్ కాలనీ, అమర్ కోపరేటివ్ సొసైటీ.. కావూరి హిల్స్‌లోని నివాసాలకు..మొత్తం 204 మందికి నోటీసులు ఇచ్చారు అధికారులు.

Full View


Tags:    

Similar News