Hydra: మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు

Hydra: భారీ పోలీస్ బందోబస్త్ నడుమ కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు

Update: 2024-09-08 04:40 GMT

Hydra: మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు

Hydra: మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు ఉండగా.. చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ 15 ఎకరాల 20 గుంటలు. 2013లో ఇరిగేషన్ అధికారులు సర్వే చేసినప్పుడు....15 ఎకరాల 23 గుంటల్లో చెరువులో నీళ్లు ఉన్నాయని గుర్తించారు. అయితే కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు FTLలో 12,13,14,16 సర్వే నెంబర్లు ఉన్నాయి. పదుల సంఖ్యలో షేడ్స్ నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. భారీ పోలీస్ బందోబస్త్ నడుమ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News