హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు కరోనా ఎఫెక్ట్ తప్పేలా లేదు. ఈ ఏడాది ఉత్సవాలు కరోనా కారణంగా రద్దు చేసే యోచనలో నిర్వాహకులు ఉన్నారని తెలుస్తోంది. 18వ విగ్రహ తయారికోసంఈ సంవత్సరం కూడా తొలి ఏకాదశి రోజు కర్ర పూజ చేయాలన్న నిర్ణయం రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వారంలో నిర్వాహకులు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. కరోనా కారణంగా అప్పటికి పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒక్క అడుగుతో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే యోచనలో నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఖైరతాబాద్ గణేషుని ఉత్సవాలు విజయవంతంగా 65 ఏండ్లు పూర్తి చేసుకున్నాయి. 65 ఏండ్లుగా ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించే ఉత్సవాలను 66వ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించాలని తొలుత ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ప్రతి ఏడాది చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా తొలి ఏకాదశి రోజు కర్ర పూజ నిర్వహించి పనులు ప్రారంభించడానికి నిర్ణయించుకున్నారు.
ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు ప్రారంభించే కర్రపూజలో పాల్గొనే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించాలని ఉత్సవ కమిటీ అధ్యక్షులు సింగరి సుదర్శన్ పేర్కొన్నారు. ప్రస్తతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో వినాయక ఉత్సవాలు రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.