CM KCR: చరిత్రలో హైదరాబాద్ సుప్రసిద్ధ నగరం.. న్యూయార్క్, లండన్, పారిస్‌లో కరెంట్ పోతుందేమో కానీ..
CM KCR: కేంద్ర సహకారం ఉన్నా లేకున్నా.. మెట్రోను విస్తరిస్తామని సీఎం స్పష్టం చేశారు.
CM KCR: కేంద్ర సహకారం ఉన్నా లేకున్నా.. మెట్రోను విస్తరిస్తామని సీఎం స్పష్టం చేశారు. మైండ్ స్పేస్ – శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ పోలీసు అకాడమీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. చరిత్రలోనే హైదరాబాద్ సుప్రసిద్ధ నగరమని, హైదరాబాద్ ఒక విశ్వనగరమంటూ కొనియాడారు సీఎం కేసీఆర్. ఢిల్లీ, చెన్నై కంటే హైదరాబాద్ నగరం పెద్దదన్న సీఎం కేసీఆర్.. సమశీతల వాతావరణం ఉండేది ఒక్క హైదరాబాద్‌లోనే అని చెప్పారు. అన్ని కులాలు, అన్ని మతాలవారికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్‌గా ఉందన్నారు. హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్‌గా మార్చామని, న్యూయార్క్, లండన్, పారిస్‌లోనైనా కరెంట్ పోవచ్చేమో కానీ.. హైదరాబాద్‌లో మాత్రం కరెంట్ పోయే పరిస్థితి లేదన్నారు సీఎం కేసీఆర్.