వినాయక చవితి సందర్భంగా భారీ బందోబస్తు

*10వేలకు పైగా వినాయకులు ప్రతిష్టించే అవకాశం

Update: 2022-08-31 03:37 GMT

వినాయక చవితి సందర్భంగా భారీ బందోబస్తు 

Hyderabad: వినాయక నవరాత్రి వేడుకవలకు మండపాలు సిద్దం అవుతుండగా.. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో భారీ బందో బస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ఈ ఏడాది దాదాపు పది వేలకు పైగా చిన్నా, పెద్ద వినాయక విగ్రహాలు ప్రతిష్టించే అవకాశం ఉందని అంచానా వేస్తున్నారు. నిమజ్జనోత్సవ బందోబస్తు పై పోలీసులు వ్యూహాలు ప్లాన్ చేస్తున్నారు. హైదరాద్ సిటీతో పాట జిల్లా కేంద్రాల్లో పోలీసు బలగాలు బందోబస్తులో పాల్గొననున్నారు. వినాక మండపాల దగ్గర ఎటువంటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో బందోబస్తును పెంచడం..ఉన్నతాధికారులు సందర్శించడంతో పాటు ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేయనున్నారు.

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ తో పాటు అదనపు సీపీలు, జాయింట్ సీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్ఐలు, ఏఎస్ఐలు సహా మొత్తం 10వేల మందికి పైగా సిబ్బింది అందుబాటులో ఉండనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గ్రే హౌండ్స్, ఆక్టోపస్ బృందాలను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బాంబు డిస్పోజబుల్ బృందాలు, యాసెస్ కంట్రోల్ బృందాలు, డాగ్‌స్క్వాడ్, బాంబు డిక్టేటర్లను బందోబస్తు ప్రక్రియలో వినియోగించనున్నారు.

నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌తో పాటు రాజన్న బౌలి, మీరాలం ట్యాంక్, ఎర్రకుంట, షేక్‌పేట్ నాలా, సరూర్ నగర్ చెరువు, సఫిల్ గూడ, మల్కాజిగిరి ట్యాంక్, హష్మత్ పేట్ లేక్‌లలో కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Tags:    

Similar News