High Court: తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు సీరియస్
High Court: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి టెస్ట్‌లు ఎందుకు చేయడంలేదని ప్రశ్నించిన హైకోర్టు
High Court: తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు సీరియస్ అయ్యింది. కరోనా వివరాలు ఏవీ ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి టెస్ట్‌లు ఎందుకు చేయడంలేదని.. జనం గుమికూడటంపై చర్యలెందుకు తీసుకోలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సినిమా థియేటర్స్, పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు చర్యలేం తీసుకోన్నారో తెలపాలని ఆదేశించింది. పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా అంటూ ప్రశ్నించింది. జన సంచారం నియంత్రణకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఏజీ సమాధానం చెప్పగా ప్రజల ప్రాణాలు పోతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ప్రభుత్వ నిర్ణయాలను మధ్యాహ్నంలోగా నివేదించాలని.. మధ్యాహ్నం విచారణకు సంబంధిత అధికారులు హాజరుకావాలని ఆదేశించింది.