Telangana: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ

Telangana: ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

Update: 2022-01-17 07:47 GMT

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

Telangana: తెలంగాణలో కొవిడ్‌ పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఆర్‌టీ-పీసీఆర్‌, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.

కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని అభిప్రాయపడింది. కరోనా వ్యాప్తి నియంత్రణపై ఇవాళ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు విచారణ సందర్భంగా ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

Full View


Tags:    

Similar News