Sriram Sagar Project: రెండ్రోజులుగా ఎస్సారెస్పీలోకి భారీ వరద

Sriram Sagar Project: ఎగువ గోదావరి నుంచి రెండ్రోజులుగా లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో ఉత్తర తెలంగాణ వర ప్రధాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది.

Update: 2024-09-04 06:55 GMT

Sriram Sagar Project: రెండ్రోజులుగా ఎస్సారెస్పీలోకి భారీ వరద

Sriram Sagar Project: ఎగువ గోదావరి నుంచి రెండ్రోజులుగా లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో ఉత్తర తెలంగాణ వర ప్రధాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మహారాష్ట్రతో పాటు నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలకు శ్రీరాం సాగర్‌కి వరద పోటెత్తింది. ప్రాజెక్టు నీటిమట్టం పూర్తి స్థాయికి చేరడంతో SRSP 41 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 2 లక్షల 20 వేల క్యూసెక్కులు కాగా... ఔట్ ఫ్లో లక్షా 75 వేలుగా ఉంది.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం వెయ్యి 91 అడుగులకు గాను ప్రస్తుతం వెయ్యి 89 అడుగులకు చేరింది. నీటి సామర్థ్యం 80.5 టీఎంసీలకు గాను ప్రస్తుతం 73.369 టీఎంసీలకు చేరుకుంది. రెండ్రోజులుగా SRSP నీటిమట్టం గంటగంటకూ పెరుగుతున్న పరిస్థితి ఏర్పడటంతో ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోను అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఎగువన మహారాష్ట్రలో విష్ణుపురి, గైక్వాడ్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు క్యూసెక్కుల నీటి విడుదల చేయడంతో కందకుర్తు వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతుంది.

Tags:    

Similar News