భారీగా పెరిగిన చికెన్ ధరలు

కరోనా మహమ్మారి దెబ్బకు పడిపోయిన చికెన్ ధరలు ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి.

Update: 2020-03-30 03:23 GMT

కరోనా మహమ్మారి దెబ్బకు పడిపోయిన చికెన్ ధరలు ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి.vగత 20 రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ వ్యాపారం పూర్తిగా కుప్పకూలింది. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందన్న పుకార్లతో.. చికెన్ తినేందుకు జనం జంక్కారు. ఈ క్రమంలో చికెన్ రేట్లు భారీగా పడిపోయాయి. సాధారణంగా 180-200 రూపాయిలు ఉండే కిలో చికెన్ ధర కేవలం 30రూపాయిలు పలికింది. ఎంత తక్కువకు అమ్మినా.. చికెన్ షాపులు మాత్రం వెలవెలబోయాయి. అసలు చికెన్ కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఫాల్ట్రి యజమానులు లబోదిబోమన్నారు.

ఇప్పుడు మొత్తం మారిపోయింది. నిన్న (ఆదివారం) మాత్రం చికెన్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. కరోనా వైరస్ ప్రభలేందుకు చికెన్‌, మటన్‌, చేపలు, గుడ్లు ఏవీ కారణం కాదాని అధికారులు చెబతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తి మరింత పెరగాలంటే చికెన్ ఎక్కువగా తినాలి' అని సీఎం స్వయంగా ప్రకటించడంతో ప్రజల్లో అపోహలు తొలగాయి.

ఇక ఇదే అదునుగా వ్యాపారులు మాంసం ధరలు అధికంగా పెంచేశారు. హైదరాబాద్‌లో కిలో చికెన్ ధర 240 రూపాయలకి చేరింది. కొన్ని చోట్ల రూ.200 నుంచి రూ.220 మధ్య అమ్మకాలు జరిగాయి. మటన్‌ ధర 650 నుంచి 700 రూపాయల మధ్య ఉండేది. కానీ ఆదివారం రూ.800 కి చేరింది. జనావాసాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో రేట్లు భారీగా పెంచేశారు. చేపల ధర కూడా కిలో రూ.110 నుంచి 150 వరకు పెంచేశారు. మాంసం ప్రియులకు ధరలు షాక్ కనిపించిన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News