Haritha Haram: తెలంగాణలో రేపటి నుంచి హరితహారం.. 20 కోట్ల మొక్కలు నాటాలని..
Haritha Haram: తెలంగాణలో రేపటి నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభం కానుంది.
Haritha Haram: తెలంగాణలో రేపటి నుంచి హరితహారం కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ఏడాది అటవీశాఖ 20 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు పంచాయతీ రోడ్ల బహుళ వనాలు నాటే కార్యక్రమానికి సిద్ధమయ్యారు. అలాగే ఇంటింటికీ 6మొక్కలు నాటే టార్గెట్‌తో ముందడుగు వేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15వేల 2వందల 41నర్సరీలల్లో 25 కోట్ల మొక్కలను అందుబాటులో ఉంచారు.
రేపటి నుంచి 10వ తేదీ వరకు పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై రాష్ట్రమంతటా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ప్రతి ప్రాంతంలో అటవీ భూముల గుర్తింపు, అటవీ పునరుద్ధరణకు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం 32 కోట్ల రూపాయల గ్రీన్ బడ్జెట్ నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. నాటిన ప్రతి మొక్కలు ఖచ్చితంగా 85 శాతం బతికేలా పంచాయతీ రాజ్ చట్టం అమలుకు నిర్ణయం తీసుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వం.