Harish Rao: సీఎం రేవంత్‌కు హరీష్‌రావు బహిరంగ లేఖ
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్లుల చెల్లింపు సకాలంలో జరగడం లేదు
Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డికి మాజీమంత్రి హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బిల్లుల చెల్లింపు సకాలంలో జరగడం లేదని ఆయన లేఖలో తెలిపారు. 2 లక్షల మంది పాడి రైతులు విజయ డెయిరీకి పాలు సరఫరా చేస్తున్నారని, కానీ.. వారికి సకాలంలో బిల్లులు అందడం లేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రతి 15 రోజులకు బిల్లులు చెల్లించేవాళ్లమన్న హరీష్‌రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో 45 రోజుల పాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం 80 కోట్ల రూపాయలు పాడి రైతులకు చెల్లించాల్సి ఉందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పాడి రైతులకు ప్రతి 15 రోజులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
పాడి పశువులను పోషిస్తున్నవాళ్లంతా పేదలు, మధ్యతరగతి ప్రజలేనన్న హరీష్.. వివిధ మార్గాల ద్వారా అప్పు చేసి పాడి రైతులు పశువులను కొనుగోలు చేశారన్నారు. సకాలంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. తీసుకున్న అప్పునకు వడ్డీ కూడా కట్టలేని పరిస్థితిలో పాడి రైతులు ఉన్నారని, పెండింగ్‌లో ఉన్న 80 కోట్ల బిల్లులను ఒకేసారి విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్‌రావు.